Survey: అభద్రతకు లోనవుతున్న 35 శాతం మంది నైట్ డ్యూటీ మహిళా డాక్టర్లు

by S Gopi |
Survey: అభద్రతకు లోనవుతున్న 35 శాతం మంది నైట్ డ్యూటీ మహిళా డాక్టర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల కోల్‌కతాలో ట్రెయినీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన మొత్తం దేశాన్ని కుదిపేస్తోంది. దీని ఆధారంగా నైఫ్ట్ షిఫ్ట్ చేసే మహిళా వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను అంచనా వేసేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఆన్‌లైన్ సర్వే చేపట్టింది. ఐఎంఏ చేసిన ఈ సర్వేలో ఆందోళనకు గురిచేసే అనేక అంశాలు బహిర్గతమయ్యాయి. ఈ అంశంపై ఇప్పటివరకు దేశంలో జరిగిన అతిపెద్ద సర్వే ఇదని ఐఎంఏ అభిప్రాయపడింది. ఇందులో 63 శాతం మంది మహిళలు పాల్గొన్నారు. అధ్యయనం ప్రకారం, సర్వేలో పాల్గొన్న వైద్యులలో మూడింట ఒక వంతు మహిళలు నైట్ డ్యూటీలో అభద్రతకు లోనవుతున్నట్టు చెప్పారు. చాలావరకు మహిళలు తమ రక్షణ కోసం సొంతంగా ఆయుధాలను వెంట తీసుకెళ్తున్నట్టు తెలిపారు. 45 శాతం మంది తాము నైట్ షిఫ్ట్ సమయంలో విడిగా డ్యూటీ రూమ్ కూడా లేదని చెప్పారు. డ్యూటీ రూమ్ ఉండటం వల్ల కొంత భద్రత ఉన్నట్టు భావిస్తామని వైద్యులు చెప్పారు. మొత్తం వైద్యుల్లో 24.1 శాతం మంది నైట్ షిఫ్ట్ ఇబ్బందిగా ఉందని, 11.4 శాతం ఎక్కువ ఇబ్బందిగా ఉన్నట్టు చెప్పారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. ఎక్కువ మంది షిఫ్ట్‌లో ఉండటం, కొన్నిటికి తాళాలు లేకపోవడం, ప్రత్యామ్నాయ రెస్ట్ ఏరియా చూసుకోవాల్సి రావడం, అటాచ్ బాట్‌రూమ్ లేకపోవడం వంటి అనేక సమస్యలు ఉన్నాయని సర్వేలో తేలింది. 53 శాతం మంది డ్యూటీ రూమ్‌లు తాము పనిచేసే వార్డు, క్యాజువాలిటీ ప్రదేశానికి దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed