మా జీవితం ఒక తెరిచిన పుస్తకం.. హిండెన్‌బర్గ్ ఆరోపణలను ఖండించిన సెబీ చీఫ్ భర్త

by Maddikunta Saikiran |
మా జీవితం ఒక తెరిచిన పుస్తకం.. హిండెన్‌బర్గ్ ఆరోపణలను ఖండించిన సెబీ చీఫ్ భర్త
X

దిశ, వెబ్‌డెస్క్ : సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చైర్‌పర్సన్ మాధబి పూరి బుచ్‌, ఆమె భర్త ధవల్ బుచ్‌పై నిన్న హిండెన్‌బర్గ్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే . హిండెన్‌బర్గ్ ప్రకారం మారిషస్ దేశంలో అదానికి చెందిన కంపెనీల్లో సెబీ చైర్‌పర్సన్, ఆమె భర్త ధవల్ బుచ్‌లకు వాటాలు ఉన్నాయని తెలిపింది. దీనిపై ఆమె భర్త స్పందిస్తూ.. శనివారం తమపై షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను నిరాధారమైనవని , తమ ఆర్థిక విషయాలు తెరిచిన పుస్తకమని వెల్లడించారు. కాగా గతంలో అదానిపై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల విషయంలో సెబీ (SEBI) హిండెన్‌బర్గ్ కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దానికి ప్రతీకారంగానే తమపై హిండెన్‌బర్గ్ ఈ ఆరోపణలు చేయడం దురదృష్టకరమని మాధబి పూరీ బుచ్ భర్త ధవల్ బుచ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ధవల్ బుచ్ మాట్లాడూతూ.. మేము భారత పౌరులుగా ఖచ్చితంగా హిండెన్‌బర్గ్ కు తమ ఆర్థిక పత్రాలను, అలాగే వారికీ ఏదైనా పత్రాలు కావాలంటే ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఈ ఆరోపణలపై పూర్తి పారదర్శకత కోసం త్వరలోనే అన్ని వివరాలు ప్రకటిస్తామని ధవల్ బుచ్ తెలిపారు. కాగా.. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. అలాగే ఈ కుంభకోణంపై విచారించడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలనీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

Next Story

Most Viewed