'ప్రతిపక్షాలకు కూడా బాండ్లు అందాయి, అవి కూడా దోపిడీయేనా?':అమిత్ షా

by Dishanational1 |
ప్రతిపక్షాలకు కూడా బాండ్లు అందాయి, అవి కూడా దోపిడీయేనా?:అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల బాండ్ల గురించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘాటుగా బదులిచ్చారు. శుక్రవారం జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఎన్నికల బాండ్ల స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద దోపీడీ పథకం, ప్రధాని మోడీని అవినీతి ఛాంపియన్ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన అమిత్ షా, ప్రతిపక్షాలు సైతం ఎన్నికల బాండ్ల స్కీమ్ ద్వరా విరాళాలను అందుకున్నాయి. మరి వాటిని కూడా దోపిడీగానే భావిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలి. మా పార్టీపై ఎలాంటి అవినీతి ఆరోపణలు చేయడానికి లేని కారణంగానే వారు ఇలాంటి గందరగోళాన్ని సృష్టించాలని చూస్తున్నారు. వారి కుట్రలు ఫలించవని అమిత్ షా విమర్శించారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత అత్యున్నత న్యాయస్థానం ప్రజల సమాచార హక్కును ఉల్లంఘిస్తున్న ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని, రాజకీయ పార్టీలు, దాతల మధ్య క్విడ్ ప్రోకోకు దారితీయవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed