- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
One Nation One Election: త్వరలోనే 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' బిల్లు.. ఈ టర్మ్ లోనే అమలు చేసేందుకు బీజేపీ కసరత్తు!
దిశ, వెబ్ డెస్క్: "ఒకే దేశం-ఒకే ఎన్నికలు"(One Nation One Election)ను అమలు చేసేందుకు ఎన్డీయే(National Democratic Alliance) ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీజేపీ ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత హయాం లోనే బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.'ఒకే దేశం-ఒకే ఎన్నికలు' బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. అయితే ఇది అతి త్వరలోనే కార్యరూపం దాల్చబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో.. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం.. 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ నివేదిక వెలువడింది. లోక్ సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ పొందుపరిచిన కీలక హామీలలో 'ఒకే దేశం-ఒకే ఎన్నికలు' అనేది కీలకంగా ఉంది. అయితే ఈ ఏడాది ఎర్రకోట వేదికగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా.. ప్రధాని మోదీ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ.. 'ఒకే దేశం-ఒకే ఎన్నికల' చట్టం కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం 'ఒకే దేశం-ఒకే ఎన్నికల' పై.. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలు, లోక్ సభ స్థానాలకు తొలి దశలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో మార్చిలో ఈ ప్రతిపాదన తెచ్చింది. 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపి, దేశవ్యాప్తంగా ఎన్నికల చక్రాన్ని ఏకకాలంలో నిర్వహించాలని ప్యానెల్ సిఫారసు చేసింది.కాగా ప్రస్తుతం రాష్ట్రాలు, లోక్ సభ స్థానాలకు వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.