- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మరోసారి బయటపడ్డ డ్రాగన్ వక్ర బుద్ధి.. భారత్ లోకి ప్రవేశించేందుకు చైనా కుయుక్తులు!
దిశ, వెబ్ డెస్క్: డ్రాగన్(China) బుద్ధి అస్సలు మారడం లేదు. పొరుగున ఉన్న దేశాలతో ఏరికొరి గొడవలకు దిగడం చైనాకు షరామామూలైపోయింది. అయితే ఇది ఇప్పుడు మొదలు పెట్టిందేం కాదు, కొన్ని దశాబ్దాల నుంచి డ్రాగన్ పన్నుతున్న కుట్రలివే! గత కొంతకాలంగా భారత్ తో కయ్యానికి కాలు దవ్వుతున్న చైనా.. ఇప్పుడు మరోసారి భారత్ పై తన వక్రబుద్ధిని చాటుకుంది.
తాజాగా చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ.. అరుణాచల్ ప్రదేశ్ లోని అంజా జిల్లాలో ఉన్న 'కపాపు' అనే ప్రాంతంలోకి చొరబడినట్లు కొన్ని ఆనవాళ్ల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ ప్రాంతం ఇండో-చైనా బార్డర్ కు దాదాపు 60 కిలోమీటర్ల సమీపంలో ఉంది. ఈ ప్రాంతంలో చైనా ఆర్మీ.. చలిమంటలు కాచుకున్న ఆనవాళ్లతో పాటు బండ రాళ్లపై స్ప్రే పెయింట్ తో చైనా-2024 అని రాసి ఉన్న గుర్తులు కనిపించాయి. వారి దేశానికి సంబంధించిన కొన్ని ఇతర గుర్తులను(symbols) కూడా బండలపై వేశారు. అలాగే చైనాకు చెందిన కొన్ని ఆహార పదార్థాల ప్యాకెట్స్ కూడా అక్కడే లభించడంతో.. కొద్ది రోజుల ముందే చైనాకు చెందిన బలగాలు ఆ ప్రాంతంలోనే శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక లడఖ్(Ladakh) విషయానికొస్తే.. ఈ ప్రాంతంలో సమయం చిక్కినప్పుడల్లా చైనా తన కుయుక్తులను పన్నుతున్న సంగతి తెలిసిందే. లడఖ్ సరిహద్దులో ఉన్న 'లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్'(Line of Actual Control) లో.. చైనా ఆర్మీ 6 కొత్త హెలిస్ట్రిప్ లను నిర్మించింది. ఈ విషయం శాటిలైట్ ఫోటోల ద్వారా వెల్లడైంది. అయితే ఈ హెలిస్ట్రిప్ లు ఉన్న ప్రదేశం.. లడఖ్ లో ఉన్న డెమ్ చోక్ కు కేవలం 100 మైళ్ళు మాత్రమే ఉంది. దీని కారణంగా.. భారత్ కు ప్రమాదం మరింత పొంచి ఉందని రక్షణ శాఖ ఇప్పటికే వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చైనాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రపంచ దేశాలతో భారత్ స్నేహంగా ఉండటంతో పాటు సైనికపరంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ఎదగడం చూసి చైనాకు మింగుడు పడడం లేదు. అందువల్లే భారత్ ను ఎలాగైనా ఇరుకున పెట్టే ఉద్దేశంతో.. భారత్ పై తరచూ కవ్వింపు చర్యలకు దిగుతోంది డ్రాగన్.