రైల్వే ట్రాక్‌పై పడుకొని పంజాబ్ రైతుల నిరసనలు

by GSrikanth |
రైల్వే ట్రాక్‌పై పడుకొని పంజాబ్ రైతుల నిరసనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పంజాబ్‌లో మరోసారి రైతులు నిరసనలు చేపట్టారు. పంజాబ్‌లోని 18 రైతు-కార్మిక సంస్థలు తమ డిమాండ్ల కోసం నేటి నుంచి సెప్టెంబర్ 30 వరకు రైల్ రోకో ఆందోళన నిర్వహించనున్నాయి. రైతుల ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేయగా, పలు రైళ్ల మార్గాలను కుదించింది. ఇవాళ పంజాబ్ రైతులు అమృత్‌సర్‌లోని దేవిదాస్‌పురాలో 'రైల్-రోకో' నిరసనను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ సర్వాన్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ.. రైతుకూలీల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, స్వామినాథన్‌ కమిషన్‌ నివేదికను అమలు చేయాలని, రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన పంజాబ్‌ ప్రజల కుటుంబాలకు పరిహారం, ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వరదలు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎంఎస్పీపై చట్టం చేయాలి. ఎంఎన్ఆర్ఈజీఏ కింద ప్రతి సంవత్సరం 200 రోజుల ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకుంటే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed