- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని మోడీ మైనారిటీ వ్యాఖ్యలపై మల్లికార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం చేసిన మైనారిటీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గె గట్టి కౌంటర్ ఇచ్చారు. ఓట్ల కోసమే ప్రధాని మోడీ ప్రజలను విభించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ, బీజేపీ గురువు ఆర్ఎస్ఎస్‌లకు హిండెన్ ఎజెండా ఉందని ఖర్గె అన్నారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశ సంపదపై ముస్లింలకే మొదటి హక్కు అని చెప్పినట్టు ప్రధాని మోడీ ఇటీవల ప్రస్తావించారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అందరి ఆస్తులను సర్వే చేస్తామని, తల్లులు, మహిళల బంగారం లెక్కించి దాని గురించి పూర్తి సమాచారం సేకరించి, తర్వాత ఆ ఆస్తిని పంపిణీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొందన్నారు. ఆఖరికి వారు మీ మంగళసూత్రాన్ని కూడా వదలరని మోడీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యవహారం బీజేపీపై ప్రతిపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ప్రధాని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు.. కాంగ్రెస్ ఎవరినీ బుజ్జగించడంలేదని, ఇది మా మేనిఫెస్టోలోనే ఉంది. ఇదేమీ హిడెన్ ఎజెండా కాదు. ఎవరికైనా హిడెన్ ఎజెండా ఉంటే అది మోడీ, ఆర్ఎస్ఎస్‌లదే అని, ప్రధాని ఆర్ఎస్ఎస్ పంథాలో వెళ్తున్నారని ఖర్గె విమర్శించారు.