US Ex-Diplomat: భారత్ నిజాయితీని ప్రతిసారీ అనుమానించాల్సిన పనిలేదు- కండొలిజా రైస్

by Shamantha N |
US Ex-Diplomat: భారత్ నిజాయితీని ప్రతిసారీ అనుమానించాల్సిన పనిలేదు- కండొలిజా రైస్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌ నిజాయితీని ప్రతిసారీ అనుమానించాల్సిన పనిలేదని అమెరికా (USA) మాజీ విదేశాంగ మంత్రి కండొలిజా రైస్ అన్నారు. ప్రధాని మోడీ రష్యా పర్యటనపై ఆమె స్పందించారు. ప్రతీ ఐదు నిమిషాలకోసారి భారత్ కు అమెరికా విశ్వాసపరీక్ష పెట్టాల్సిన పని లేదన్నారు. ఆమె ఇండస్‌ ఎక్స్‌ (India-United States Defence Acceleration Ecosystem) సదస్సులో మాట్లాడారు. భారత్- అమెరికా బంధం బలపడుతోందని.. సత్సంబంధాల కోసం ఇరువైపుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వైట్ హౌజ్ లోకి ఎవరు వచ్చినా.. భారత్ తో తమ బంధం ప్రాముఖ్యత తెలుసని అన్నారు. భారత్‌ భావిస్తున్నట్లు చాలా దేశాలు స్ట్రాటజీల్లో స్వయంప్రతిపత్తిని (strategic autonomy)ని కోరుకుంటాయన్నారు. దాంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని..కానీ ఇరు దేశాల కీలక ప్రయోజనాలే అంతిమంగా బలమైన భాగస్వామ్యానికి దారితీస్తాయన్నారు.

రష్యా ఆయుధాలన్నీ 'జంక్'

రష్యా ఆయుధాలు పూర్తిగా జంక్ అని రైస్ విమర్శించారు. మోడీ రష్యా పర్యటనలో రక్షణ సామగ్రి గురించి చర్చ జరగలేదన్నారు. భారత్ తో రక్షణపరమైన సహకారం పెంపొందించుకోవడంలో అమెరికా నిదానంగా వ్యవహరిస్తోందని గుర్తుచేశారు. చైనా అధినేత జిన్‌పింగ్‌(Chinese President Xi Jinping), రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Russian President Vladimir Putin) మధ్య ఉన్న రిలేషన్ గురించి మోడీకి తెలుసన్నారు. ఆ రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం భారత్ కు పెద్ద సమస్యగా మారే ఛాన్స్ ఉందని తెలిపారు. రష్యా(Russia) సైనికపరంగా, చైనా(China) టెక్నాలజీ పరంగా దుకుడుగా ఉన్నాయని తెలిపారు. అందుకే, వాటిని ఎదుర్కోవడం భారత్ కు కష్టమన్నారు. ఇకపోతే, భారత్‌-అమెరికా మధ్య పౌర అణుఒప్పందం జరగడంలో నాటి విదేశాంగ మంత్రి రైస్‌ కీలక పాత్ర పోషించారు.

Advertisement

Next Story

Most Viewed