Omar Abdullah: ఈవీఎంలపై ఏడుపు ఆపాలి.. కాంగ్రెస్‌కు ఒమర్ అబ్దుల్లా చురకలు

by vinod kumar |
Omar Abdullah: ఈవీఎంలపై ఏడుపు ఆపాలి.. కాంగ్రెస్‌కు ఒమర్ అబ్దుల్లా చురకలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ (congress party) అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ (NC) చీఫ్ ఒమర్ అబ్దుల్లా (Omar abdhullah) తప్పుపట్టారు. ఈవీఎంలపై ఏడ్వడం మానుకోవాలని సూచించారు. ఆదివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. ‘ఎన్నికల్లో గెలిచినప్పుడు సంబురాలు చేసుకుంటారు. ఓడిపోయినప్పుడు ఈవీఎంలపై ప్రశ్నలు సంధిస్తారు. ఇది సరికాదు. ఎన్నికల్లో పోటీ చేసే ముందు పార్టీలు ఈవీఎంలపై తమకు నమ్మకం ఉందో లేదో తేల్చుకోవాలి’ అని చెప్పారు. అదే ఈవీఎంలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన వంద మందికి పైగా పార్లమెంటు సభ్యులు గెలిచారని, దానిని పార్టీ విజయంగా సంబురాలు చేసుకుని కొంత కాలం తర్వాత ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు. ఓటింగ్ యంత్రాలపై నమ్మకం లేని పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయొద్దని తెలిపారు. ఢిల్లీలో ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌ చేపట్టడం ఎంతో మంచిదని తెలిపారు. కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడం ఒక అద్భుతమైన ఆలోచన అని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed