Omar Abdullah: కాంగ్రెస్‌తో పొత్తు కఠిన నిర్ణయమే.. ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా

by vinod kumar |
Omar Abdullah: కాంగ్రెస్‌తో పొత్తు కఠిన నిర్ణయమే.. ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌తో పొత్తు అంత తేలికైన నిర్ణయమేమీ కాదని, పార్టీ గెలిచే అవకాశం ఉందని భావించిన చోట కూడా చాలా సీట్లు త్యాగం చేయాల్సి వచ్చిందని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా అన్నారు. పార్టీ ప్రధాన కార్యలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కశ్మీర్ ప్రజల హక్కులను పునరుద్దరించడానికే సమిష్టిగా పోరాడుతున్నామని చెప్పారు. మా పోరాటం వల్ల కశ్మీర్‌లోని ప్రతి పౌరుడికీ ప్రయోజనం కలుగుతుందన్నారు. ఎంతో కఠిన నిర్ణయం అయినప్పటికీ కశ్మీర్ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో చేతులు కలిపామని స్పష్టం చేశారు. ఎన్సీ గట్టి పోటీ ఇవ్వగలదని నిర్ణయించినప్పటికీ సీట్లను వదులుకున్నామని చెప్పారు. బీజేపీని ఓడించాలంటే హస్తం పార్టీతో పొత్తు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఎన్సీ అధికారంలోకి వస్తే, జమ్మూ కశ్మీర్ నుండి పబ్లిక్ సేఫ్టీ యాక్ట్‌ను రద్దు చేస్తామని చెప్పారు. కాగా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్ లు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. మొత్తం 90 సీట్లకు గాను ఎన్సీ 51, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

Advertisement

Next Story