- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారానికి 70 గంటలు పనిచేస్తున్నారా?.. అకాలమరణాలు తప్పవన్న న్యూరాలజిస్టు
దిశ, నేషనల్ బ్యూరో: అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే.. భారత యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇటీవలే ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి అన్నారు. ఆ వ్యాఖ్యలను ఓలా సీఈవో భవిష్ సమర్థించారు. ఓ పాడ్‌క్యాస్ట్‌లో మాట్లాడుతూ.. నారాయణమూర్తి సలహాను పాటిస్తున్నట్లు తెలిపారు. వారంలో 70 గంటలు పనిచేయాలన్న భవిష్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నారాయణ మూర్తి, భవిష్ వ్యాఖ్యలను పలువురు సమర్ధించగా.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల కలిగే అనర్థాలను న్యూరాలజిస్టులు తెలిపారు.
ఎక్కువ పనిగంటల వల్ల అకాల మరణాలు
ఎక్కువ సేపు పనిచేయడం వల్ల కలిగే అనర్థాల గురించి హైదరాబాద్‌లోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌కు చెందిన టాప్ న్యూరాలజిస్ట్ సుధీర్ కుమార్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వివరించారు. ఎక్కువగా పనిచేయడం అకాల మరణాలకు దారితీస్తుందని హెచ్చరించారు. “వారానికి 55 లేదా అంతకంటే ఎక్కువ గంటలు పని చేయడం వల్ల 35 శాతం అధికంగా హార్ట్ స్ట్రోక్ వచ్చి ప్రమాదం ఉంది. 35-40 గంటలు పని చేయడంతో పోలిస్తే ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్‌తో మరణించే అవకాశం 17 శాతం ఎక్కువ. వారానికి 55 గంటలు పనిచేయడం వల్ల ఏటా 8 లక్షల మందికిపైగా మరణిస్తున్నారు. అధిక పని గంటలతో అధిక బరువు, ప్రీ డయాబెటిస్, టైప్-2 మధుమేహం వంటివి పెరుగుతాయి. దాని వల్ల అనేక వ్యాధులకు, ముందస్తు మరణానికి దారితీస్తుంది. వారంలో 40 గంటలు పనిచేసే వారి కన్నా ఎక్కువగా పనిచేసే వారిలో మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి” అని వివరించారు. సీఈవోలు తమ కంపెనీ లాభాల కోసం ఉద్యోగులకు ఎక్కువ పని గంటలను సిఫారసు చేస్తారని విమర్శించారు.