- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Oil prices rise: హెజ్ బొల్లా అధినేత హత్యతో చమురు మార్కెట్ల తీవ్ర ప్రభావం
దిశ, నేషనల్ బ్యూరో: హెజ్‌బొల్లా అధినేత నస్రల్లా హత్యతో చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. నస్రల్లాను ఇజ్రాయెల్ వాయుసేన హతమార్చడంతో.. చమురు ధరలు కొండెక్కాయి. ఈ పరిణామాలపై ఇరాన్ స్పందించింది. దీంతో ట్రేడర్లలో ఆందోళన నెలకొనడంతో ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 72 డాలర్లను దాటేసింది. ఇక వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌పై మాత్రం దీని ప్రభావం అంతగా లేదు. బ్రెంట్ క్రూడ్ నవంబర్ డెలివరీ కాంట్రాక్టులు 16శాతం పెరిగాయి. గత వారం బ్రెంట్‌క్రూడ్ ధర 3 శాతం పతనం కాగా.. డబ్ల్యూటీఐ ధర 5శాతం పడిపోయింది.
చైనా ఆర్థిక వ్యవస్థ..
అప్పట్లో చైనా ఆర్థికవ్యవస్థ ఒత్తిడిలో ఉందని వార్తలు రావడంతో అవి చమురు ధరలను ప్రభావితం చేశాయి. చైనానే రెండో అతిపెద్ద చమురు దిగుమతిదారు కావడంతో మార్కెట్లో పరిస్థితి అధ్వానంగా మారింది. కానీ, సోమవారం నాటికి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో చేరడంతో చమురు రవాణా మరింత కష్టం అవుతుందని.. భయాలు వస్తున్నాయి. హెజ్‌బొల్లా, హమాస్, హూతీలపై దాడులకు ప్రతీకారంగా హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే ఇంధన ధరలు భగ్గుమనడం ఖాయం. అంతేకాదు.. ఇరాన్ నేరుగా యుద్ధం చేస్తుందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పశ్చిమాసిలో అమెరికా నౌకలను మోహరించేందుకు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ ఇప్పటికే వివరుల వెల్లడించారు. ఇరాన్ లేదా దాని అనుబంధ సంస్థలు పశ్చిమాసియాలో అమెరికా ప్రయోజనాలు దెబ్బతీస్తే తగిన చర్యలు తీసుకొంటామని పెంటగాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇకపోతే, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే.. యెమన్ లోని హౌతీలపైనా తిరుగుబాటు చేస్తోంది.