- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్యకు లక్షల్లో పోటెత్తిన రామ భక్తులు.. దర్శనం నిలిపేసిన అధికారులు
దిశ, వెబ్ డెస్క్: సోమవారం అయోధ్య రామ మందిరంలో బాల రాముడికి ప్రాణ ప్రతిష్ట చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భారీ ఎత్తున భక్తులు అక్కడకు చేరుకోగా ఎవరిని లోని పంపించలేదు. దీంతో స్థానిక హోటల్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రోడ్లపై రాత్రి స్టే చేసిన రామ భక్తులు ఈ రోజు ఉదయం ఒక్కసారిగా ఆలయం వైపు పోటెత్తారు. దీంతో అధికారులు తెల్లవారుజామున 3 గంటలకు గేట్లు తెరిచి భక్తులను ఆలయంలోనికి అనుమతించారు. ఈ సమయంలో తోపులాట కూడా చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న రామ భక్తులు ఈ సారి లక్షల్లో ఆలయ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. దీంతో అధికారులు ఏమీ చేయలేక పోయారు. భారీ రద్దీ కారణంగా అయోధ్య రామమందిరం ప్రవేశాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులను దర్శనానికి పంపుతున్నారు. అయోధ్యలోని ప్రధాన రహదారులన్నీ రామ భక్తులతో నిండిపోవడంతో.. పోలీసులు, అయోధ్య నిర్వాహకులు తీసుకున్న తాజా నిర్ణయంలో, అయోధ్య రామమందిర ప్రవేశ ద్వారాలను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో రాత్రి నుంచి చలిలో రాముని దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు ఆలయంలోకి ప్రవేశం కల్పించకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని.. పరిస్థితుల కుదుట పడగానే తిరిగి దర్శనం ప్రారంభం అవుతుందని చెప్పుకొస్తున్నారు.
రాముని దర్శనం ఎందుకు ఆగింది..?
ముందుగా చెప్పినట్లుగా ఈ రోజు సాధారణ ప్రజల కోసం ఆలయం తెరవబడినప్పటి నుంచి, గంటల తరబడి వేచి ఉన్న భక్తుల రద్దీ కారణంగా అయోధ్య రామ మందిర ప్రవేశం మూసివేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పరిపాలన, పోలీసులు ఆలయ ప్రవేశాన్ని తాత్కాలికంగా మూసివేసి ఆలయానికి వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. హైవేలపై కూడా బారికేడ్లు వేసి ఈ వైపు వచ్చే వాహనాలను తాత్కాలికంగా నిలిపివేశారు.