- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arjun: చిక్కడపల్లి పీఎస్‌లో అల్లు అర్జున్.. పోలీసుల విచారణ ప్రారంభం
దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట (Stampede) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇటీవలే బెయిల్ (Bail)పై బయటకు వచ్చారు. హైకోర్టు (High Court) ఆదేశాల మేరకు చిక్కడపల్లి పోలీసులు (Chikkadpally Police) విచారణకు రావాలంటూ సోమవారం ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు అల్లు అర్జున్ (Allu Arjun) కాసేపటి క్రితం చిక్కడపల్లి పీఎస్‌కు చేరుకున్నారు. ఏసీపీ రమేష్ (ACP Ramesh), సీఐ రాజు (CI Raju), అల్లు అర్జున్ అడ్వొకేట్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ ప్రారంభం అయినట్లుగా తెలుస్తోంది. అయితే, తాజాగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఫుటేజ్‌ను పోలీసులు విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆ ఫుటేజ్ ఆధారంగానే ఇవాళ విచారణను మొదలు పెట్టినట్లుగా సమాచారం. మొత్తం 18 ప్రశ్నలతో కూడిన పేపర్‌ను ఏసీపీ రమేష్ కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్‌కు అందజేశారు. ఆ ప్రశ్నల ఆధారంగా ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్నారు.