- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఫోన్‌పై మోజు.. డెలివరీ బాయ్ మర్డర్
దిశ, వెబ్‌డెస్క్: ఐ ఫోన్‌పై మోజు ఓ 20 ఏళ్ల యువకుడిని హంతకుడిగా మార్చింది. ఆన్‌లైన్‌లో ఐ ఫోన్ ఆర్డర్ చేసినా చేతిలో చెల్లించేందుకు డబ్బులు లేక పోవడంతో డెలివరీ బాయ్‌నే చంపేశాడు. అనంతరం డెడ్ బాడీని 4 రోజులుగా ఇంట్లో దాచి ఉంచాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఆర్డర్ చేసిన ఐ ఫోన్ కు చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో ఈ కార్ట్ డెలివరీ బాయ్ నే చంపాడో యువకుడు. అనంతంర నాలుగు రోజులుగా ఇంట్లో శవాన్ని దాచాడు.
అనంతరం శవాన్ని దగ్గరలోని రైల్వే స్టేషన్ సమీపంలో కాల్చేశాడు. ఈ దారుణ హత్యకు పాల్పడిన వ్యక్తిని హేమంత్ దత్ గా పోలీసులు గుర్తించారు. ఇతను హసన్ జిల్లా అరిస్ కెరే పట్టణానికి చెందిన వాడిగా తేల్చారు. ఆర్డర్ చేసిన ఐ ఫోన్ కు చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో ఏకంగా డెలివరీ బాయ్ ని కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఫిబ్రవరి 11న పోలీసులు అన్చ్ కొప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలో కాలిన మృతదేహాన్ని కనుగొన్నారు.
కాగా ఘటనకు సంబంధించి విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. చనిపోయిన హేమంత్ నాయక్ (23) ఈ కార్ట్ ఎక్స్‌ప్రెస్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 7న లక్ష్మీపుర లేఅవుట్‌కు చెందిన హేమంత్ దత్తా ఆర్డర్ ఇచ్చిన సెకండ్ హ్యాండ్ ఐ ఫోన్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు. ఐ ఫోన్ డెలివరీ చేసిన తర్వాత రూ.46వేలు చెల్లించాలని కోరగా నిందితుడు హేమంత్ దత్తా కత్తితో డెలివరీ బాయ్‌పై విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు.
డెడ్ బాడీని నాలుగు రోజులు ఇంట్లోనే దాచాడు. అనంతరం డెడ్ బాడీని గన్నీ బ్యాగ్‌లో ఉంచి బైక్‌పై తీసుకెళ్లి దగ్గరలోని రైల్వేస్టేషన్ సమీపంలో కాల్చేశాడు. కాగా నిందితుడు డెడ్ బాడీని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.