- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ISRO: మరో మిషన్ కోసం ఇస్రో సన్నాహాలు.. జనవరిలో శ్రీహరి కోట నుంచి వందో ప్రయోగం
దిశ, నేషనల్ బ్యూరో: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) జనవరిలో జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) ఎన్‌వీఎస్-02 ప్రయోగం చేపట్టనున్నది. ఈ మిషన్ కోసం సన్నాహాలు చేస్తుంది. ఇది శ్రీహరికోట నుంచి జరగనున్న వందో ప్రయోగం కానుంది. వచ్చే ఏడాది ప్లాన్ చేసిన పలు మిషన్‌లో జీఎస్‌ఎల్‌వీ మిషన్ ఒకటని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ తెలిపారు. ఇస్రో సోమవారం రాత్రి విజయవంతంగా స్పాడెక్స్ మిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సోమ్‌నాథ్ ఈ ప్రకటన చేశారు. స్పాడెక్స్ మిషన్‌లో పంపిన రెండు ఉపగ్రహాల డాకింగ్ జనవరి 7 వరకు పూర్తవుతుందన్నారు. ఇది ఓ రకంగా చంద్రయాన్-4కి పరీక్ష లాంటిదన్నారు. ఈ మిషన్ లో అనేక ప్రక్రియలుంటాయని.. డాకింగ్ తుది ప్రక్రియ అని చెప్పుకొచ్చారు. జనవరి 7న అది పూర్తవుతుందన్నారు. ఇస్రోకి స్పాడెక్స్ మిషన్ కీలక మైలురాయి అని ఇస్రో చైర్మన్ తెలిపారు.
చంద్రయాన్ పై
అంతేకాకుండా, ఈ సందర్భంగా చంద్రయాన్-4 మిషన్‌పై కీలక సమాచారాన్ని వెల్లడించారు. చంద్రయాన్ మిషన్ లో వివిధ మాడ్యూల్స్ ఉంటాయని.. వేర్వేరు సమయాల్లో ప్రయోగించనున్నట్లు తెలిపారు. రెండు వేర్వేరు మాడ్యూల్స్‌లో ఒకేసారి కలుపనున్నట్లు తెలిపారు. ఈ మాడ్యూల్స్ కక్షలోకి చేరుకోవాల్సి ఉంటుందని.. ఆ తర్వాత భూమి కక్ష్య, చంద్రుడి కక్ష్యలో రెండింటిలోనూ డాక్ చేయాల్సి ఉంటుందన్నారు. చంద్రుడిపై దిగి విజయవంతంగా తిరిగి రావడమే చంద్రయాన్-4 లక్ష్యమని సోమ్‌నాథ్ స్పష్టం చేశారు.