- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ajit Doval: ప్రత్యేక ప్రతినిధుల చర్చల కోసం చైనా పర్యటనకు అజిత్ దోవల్
దిశ, నేషనల్ బ్యూరో: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రత్యేక ప్రతినిధుల చర్చల కోసం త్వరలో చైనాకు వెళ్లనున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. భారత్-చైనా సరిహద్దు ప్రాంతాలలో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి పెట్రోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి ఇరు దేశాలు అక్టోబర్‌లో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత అజిత్ దోవల్ చైనా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశంలో సరిహద్దు ఘర్షణల నివారణ, పెట్రోలింగ్, బఫర్ జోన్‌లకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించనున్నట్టు సమాచారం. ఇటీవల పార్లమెంటులో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ భారత్, చైనా సంబంధాల గురించి మాట్లాడుతూ.. 2020లో చైనా తీరు కారణంగా సరిహద్దు సమస్య ఇబ్బందికరంగా ఉండేదని, గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చల ఫలితాలు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయన్నారు. భారత సరిహద్దు విషయంలో సైతం కీలకమైన పురోగతి ఉంది. తద్వారా చైనాతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. న్యాయపరమైన, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం చర్చలకు భారత్ కట్టుబడి ఉందని వెల్లడించారు.