- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డరో మత్.. రాహుల్ పై ప్రధాని మోడీ సెటైర్లు..
దిశ, నేషనల్ బ్యూరో: రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. దీంతో, ప్రధాని మోడీ రాహుల్ పై విరుచుకుపడ్డారు. బెంగాల్ లో జరిగిన ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే రాహుల్ గాంధీ అమెథీ నుంచి పారిపోయారని మోడీ విమర్శించారు. డరో మత్.. భాగో మత్ అని రాహుల్ గాంధీని హేళన చేశారు ప్రధాని మోడీ. రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో ఓడిపోయిన అమేథీ నుంచి కాకుండా.. రాయ్ బరేలీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ప్రధాని మోడీ రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రాజకీయ ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేసేందుకు బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని రాహుల్ తరచూ ఆరోపిస్తుంటారు. అలాంటి సందర్భంలో ఆయన వాడే డరో మత్ అనే కామెంట్లనే రాహుల్ ను ఉద్దేశించి అన్నారు మోడీ.
తల్లీ కొడుకులిద్దరూ భయంతో తమ స్థానాల నుంచి పోటీకి దూరంగా ఉంటారని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు మోడీ. తల్లీ కొడుకులిద్దరూ భయంతో తమ స్థానాల నుంచి పోటీకి దూరంగా ఉంటారని తాను జోస్యం చెప్పానని, సోనియా గాంధీని కూడా ప్రధాని మోదీ వదల్లేదు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీకి పోటీ చేసే ధైర్యం లేదని గతంలోనే చెప్పానని అన్నారు. సోనియా భయపడి పారిపోతుందని చెప్పినట్లుగనే.. రాజస్థాన్ కు వెళ్లి అక్కడ్నుంచి రాజ్యసభ ఎంపీగా గెలుపొందిందన్నారు.
వయనాడ్‌లో ఓడిపోతామనే భయం షెహజాదే రాహుల్ గాంధీకి ఉందని.. ఓటింగ్ ముగియగానే మరో సీటు కోసం వెతుకులాట ప్రారంభిస్తారని గతంలోనే చెప్పాని అన్నారు. ఇప్పుడు అమేథీ నుంచి కూడా పోటీ చేసేందుకు భయపడ్డారన్నారు. అక్కడి నుండి పరిగెత్తి ఇప్పుడు రాయ్‌బరేలి వైపు చూస్తున్నారని గుర్తుచేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో స్మృతి ఇరానీ గెలుపొందారు. స్మృతి విజయం సాధించిన తర్వాత మళ్లీ పోటీ చేస్తున్న అమేథీలో తాను గెలవలేనని రాహుల్‌గాంధీకి తెలుసునని.. ఇది డెడ్ గివ్‌అవే అని పేర్కొన్నారు. మే 20న ఐదోదశ పోలింగ్ లో రాయ్ బరేలీ, అమెథీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయమని రాహుల్‌ను అభ్యర్థించగా.. ఆయన అంగీకరించినట్లు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. రాయ్‌బరేలి, అమేథీ, వాయనాడ్ సీట్లు అన్నీ ప్రీతిపాత్రమైనవని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ పోటీ చేసిన స్థానంలో ఇప్పటివరకు సోనియా పోటీ చేశారని.. ఇప్పుడు అక్కడ్నుంచే రాహుల్ పోటీ చేస్తున్నారని అన్నారు. ఇకపోతే, వయనాడ్ లోక్‌సభ ఎన్నికల రెండో దశ ఏప్రిల్ 26న జరిగింది.