ఉపాధిహామీ పనుల పర్యవేక్షణకు డ్రోన్లు.. కేంద్ర సర్కారు కీలక నిర్ణయం

by Vinod kumar |
ఉపాధిహామీ పనుల పర్యవేక్షణకు డ్రోన్లు.. కేంద్ర సర్కారు కీలక నిర్ణయం
X

న్యూఢిల్లీ : ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టే పనుల నిర్వహణలో పారదర్శకతను పెంచే దిశగా కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్‌సైట్‌లపై నాలుగు రకాల పర్యవేక్షణ కోసం ఇకపై డ్రోన్లను వినియోగించనున్నారు. తాజాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (ఎస్ఓపీ) గైడ్ లైన్స్‌లో ఈ వివరాలను ప్రస్తావించారు. ఉపాధి పనులు జరుగుతుండగా లైవ్ సర్వే, పూర్తయిన పనుల తనిఖీ, ఇంపాక్ట్ అసెస్‌మెంట్, ఫిర్యాదులు వచ్చిన తర్వాత పనుల ప్రత్యేక తనిఖీ వంటి సందర్భాల్లో డ్రోన్లను వినియోగిస్తారు.

రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకానికి తమ వాటాగా సమకూర్చే ఫండ్స్ నుంచి డ్రోన్లను కొనాలని కేంద్ర సర్కారు నిర్దేశించింది. డ్రోన్లను కొనలేని పరిస్థితుల్లో.. వాటిని లీజుకు లేదా అద్దెకు ఇచ్చే సంస్థల సేవలను వినియోగించుకోవాలని కోరింది. ఈ డ్రోన్లు తీసే వీడియోలు, ఫోటోలను స్టోర్ చేయడానికి, డేటా విశ్లేషణ, రిపోర్టింగ్ ప్రయోజనాల కోసం కేంద్రీకృత డ్యాష్‌బోర్డ్‌ను రూపొందించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదించింది.

Advertisement

Next Story

Most Viewed