మోడీపై వాఖ్యలకు నోటీసులు.. రాహుల్ గాంధీ రిప్లై

by Sathputhe Rajesh |
మోడీపై వాఖ్యలకు నోటీసులు.. రాహుల్ గాంధీ రిప్లై
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీపై లోక్ సభలో తాను చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభ సెక్రటేరియట్‌కు రిప్లై ఇచ్చారు. ఈ మేరకు తన వ్యాఖ్యలను సమర్ధించుకోవడానికి వివిధ వాదనలు, చట్టాలను ఉటంకిస్తూ బుధవారం అనేక పేజీలతో వివరణాత్మక సమాధానం పంపారు.

రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక అంశంపై రాహుల్ గాంధీ లోక్ సభలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అధికార పార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

ఎలాంటి డాక్యుమెంటరీ ఆధారాలు లేకుండా రాహుల్ గాంధీ సభను తప్పుదోవ పట్టించారని, ప్రధానిపై అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించారని ఆరోపిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. దీంతో రాహుల్ ప్రసంగంలోని కొంత భాగాన్ని స్పీకర్ తొలగించారు. అనంతరం ఫిబ్రవరి 15 లోపు వివరణ ఇవ్వాలంటూ ప్రివిలైజ్ నోటీస్ జారీ చేశారు. ఈ నోటీసుపై స్పందించిన రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed