- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదే మంచి తరుణం.. విపక్షాలను ఏకం చేసేందుకు కాంగ్రెస్‌కు చాన్స్
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పై వేటు వేయడంపై విపక్షాలు మద్దతు నిలవడంతో కాంగ్రెస్ సువర్ణ అవకాశం లభించింది. ఇదే ఊపులో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను పోగు చేసే ప్రయత్నాలకు బీజంగా ప్రతిపక్షం భావిస్తోంది. గాంధీ పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించడంతో పాటు లోక్‌సభ నుంచి వేటు వేయడంతో కేంద్రానికి దాదాపు అన్ని పార్టీల నుంచి వ్యతిరేకత ఎదురైంది. పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఈ అరుదైన మద్దతును స్వాగతించింది.
తాజా పరిణామాల నడుము కాంగ్రెస్ కు అందరూ మద్దతుగా నిలిచారని, ఇది సంతోషకరమని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. రాహుల్ కు మద్దతుగా అన్ని పార్టీలు నిలబడటం శుభపరిణామమని, ప్రజాస్వామ్యాన్ని రక్షించే క్రమంలో తమతో కలిసి ఉన్నారని ఖర్గే అన్నారు. వ్యవస్థీకృత మార్గంలో వెళ్లేందుకు విపక్ష పార్టీలు ఏకం కావాలని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు.
వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్ తో కూడిన విపక్షాల కూటమి అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో తాజా పరిణామాలను కాంగ్రెస్ సానుకూలంగా మార్చుకుంటే విపక్షాలు ఏకమయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేత సభ్యత్వంపై అనర్హత వేటుపై దాదాపు అన్ని రాష్ట్రాల విపక్షాల సీఎంలు, నేతలు స్పందించారు.
కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మరోవైపు రాహుల్ గాంధీ పై అనర్హత వేటు ప్రకటనపై కేరళ సీపీఎం కీలక వ్యాఖ్యలు చేసింది. తాము రాహుల్ కు మద్దతు ఇవ్వమని, అయితే బీజేపీ అప్రజాస్వామిక చర్యలను వ్యతిరేకిస్తున్నామని ఆ పార్టీ నేత ఎంవీ గోవిందన్ అన్నారు.
- Tags
- Rahul Gandhi
- CPIM