Amit shah: పాలపొడి దిగుమతి చేసే ఆలోచనే లేదు: అమిత్ షా

by S Gopi |
Amit shah: పాలపొడి దిగుమతి చేసే ఆలోచనే లేదు: అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: పాలపొడిని దిగుమతి చేసుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రైతుల నుంచి నిరసనలు, ఆగ్రహం వ్యక్తమైన నేపథ్యంలో ఆదివారం పూణెలో జరిగిన బీజేపీ మహారాష్ట్ర కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన దీనిపై స్పష్టత ఇచ్చారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తోందని అమిత్ షా ఆరోపణలు చేశారు. 'గడిచిన పదేళ్ల కాలంలో ప్రధాని మోడీ ప్రభుత్వం ఒక్క కిలో పాలపొడిని కూడా దిగుమతి చేయలేదు. వచ్చే ఐదేళ్లలోనూ ఒక్క గ్రాము కూడా దిగుమతి కాదూ అని ఆయన పేర్కొన్నారు. పాత నోటిఫికేషన్‌లతో ప్రభుత్వం పాలపొడిని దిగుమతి చేయనుందని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. దీనిపై తాను కూడా కన్‌ఫ్యూజ్ అయ్యాయని, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌ని అడిగితే, అలాంటి నిర్ణయమే తీసుకోలేదని, గతంలో శరద్ పవార్ నిర్ణయమని చెప్పారు. దీనిపై ఎవరూ అయోమయానికి గురి కావొద్దని, పాలపొడిని దిగుమతి చేసే ఆలోచనే ప్రభుత్వానికి లేదని అమిత్ షా వివరించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు ఇలాంటి నకిలీ సమాచారం ప్రజల్లో సర్క్యులేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని ఆయన వెల్లడించారు.



Next Story