ప్రజాస్వామ్యం కాదు.. కుటుంబ రాజకీయాలు ప్రమాదంలో: అమిత్ షా

by Harish |
ప్రజాస్వామ్యం కాదు.. కుటుంబ రాజకీయాలు ప్రమాదంలో: అమిత్ షా
X

లక్నో: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం కాకుండా కుటుంబ రాజకీయాలు ప్రమాదంలో ఉన్నాయని అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం కలిగించిన విపక్షాలను ప్రజలు క్షమించరని చెప్పారు. తాజాగా కౌశంబి మహోత్సవ్ ప్రారంభ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ‘రాహుల్ గాంధీ అనర్హత వేటును సాకుగా పెట్టుకుని పార్లమెంటుకు అంతరాయం కలిగించిన ప్రతిపక్ష పార్టీలను దేశం క్షమించదు. దేశంలో ప్రజాస్వామ్యం కాదు.. కుల, కుటుంబ రాజకీయాలు ప్రమాదంలో ఉన్నాయి’ అని అన్నారు. తాజాగా రాహుల్ ఎంపీ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై విపక్షాల మద్ధతును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రాముఖ్యత చోటుచేసుకుంది.

Next Story

Most Viewed