- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరోపణలపై వివరణ ఇచ్చుకోవడం నా హక్కు: కాంగ్రెస్ మాజీ చీఫ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో తనను మాట్లాడేందుకు అనుమతించేలా కనిపించట్లేదని అన్నారు. ప్రభుత్వం తమాషాలు చేస్తుందని విమర్శించారు. గురువారం పార్లమెంటు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. యూకేలో రాహుల్ వ్యాఖ్యలను నిరసిస్తూ తాజాగా పార్లమెంట్‌లో అధికార పార్టీ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లండన్ పర్యటన తర్వాత గురువారం రాహుల్ గాంధీ పార్లమెంట్ వెళ్లారు.
తనపై చేస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చేందుకు అనుమతివ్వాలని లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాను కోరగా అందుకు నిరాకరించినట్లు చెప్పారు. ఆ ఆరోపణలపై పార్లమెంటులో స్పందించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ‘పార్లమెంటులో మాట్లాడాలని నేను స్పీకర్‌ను కోరాను. నలుగురు కేంద్ర మంత్రులు సభలో నాపై ఆరోపణలు చేశారు. మాట్లాడటం నా హక్కు. అయితే దీనిలో ఎలాంటి స్పష్టత లేదు. వారు మాట్లాడనిస్తారని నేను అనుకోవడం లేదు. శుక్రవారమైనా మాట్లాడుతానని భావిస్తున్నాను. నేను వెళ్లిన నిమిషంలోనే సభను వాయిదా వేశారు’ అని చెప్పారు.
గతంలో తాను సభలో మాట్లాడిన దంతా రికార్డు నుంచి తొలగించారని చెప్పారు. అదానీ, ప్రధాని బంధం గురించి మాట్లాడితే కేంద్రం భయపడుతుందని అన్నారు. కావాలనే ప్రభుత్వం ఈ తమాషా చేస్తుందని విమర్శించారు. అదానీ, ప్రధాని మధ్య ఏం సంబంధం ఉందని.. ఆయనకు ఇచ్చిన కాంట్రాక్టులకు రక్షణగా నిలుస్తున్నారని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ప్రవేశించే ముందు ప్రజాస్వామ్యం సరిగ్గా పనిచేస్తే తనకు మాట్లాడేందుకు అనుమతిస్తారని అన్నారు.