- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
North korea: అణు పరీక్షలకు నార్త్ కొరియా సిద్ధం.. దక్షిణ కొరియా సంచలన ఆరోపణ
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర కొరియా (North korea) తన ఏడో అణు పరీక్ష(Nuclear Test)లను చేపట్టేందుకు సిద్ధమవుతోందని దక్షిణ కొరియా (South Korea) ఆరోపించింది. అమెరికా (Amerika)ను చేరుకోగల సుదూర క్షిపణిని ప్రయోగించేందుకు సైతం సన్నాహాలు చేస్తోందని తెలిపింది. ఈ విషయంపై తమ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు చట్టసభ సభ్యులకు బుధవారం సమాచారం అందించాయని పేర్కొంది. ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతంలోని పుంగ్గే-రి టెస్టింగ్ గ్రౌండ్‌లో అణు పరీక్ష కోసం కార్యాచరణ పూర్తి చేసిందని స్పష్టం చేసింది. సొరంగం నంబర్ 3 వద్ద పేలుడు జరిగే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరుకోవడానికి రూపొందించిన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ (ICBM)ని పరీక్షించడానికి కూడా ఉత్తర కొరియా సిద్ధమవుతోందని చట్టసభ సభ్యులు లీ, పార్క్ సన్-వోన్‌లు తెలిపారు. అయితే ఖచ్చితమైన స్థానాన్ని తాము అంచనా వేయలేమని పేర్కొన్నారు. వచ్చే నెలలో మాత్రం ఖచ్చితంగా పరీక్ష జరిగే అవకాశం ఉందన్నారు. కాగా, ఉత్తర కొరియా చివరిసారిగా 2017లో ఆరో అణుపరీక్ష నిర్వహించింది.