Zeeshan Siddique: సల్మాన్ ఖాన్, జిషాన్ సిద్ధిఖీకి బెదిరింపుల కేసు.. వ్యక్తి అరెస్టు

by Shamantha N |   ( Updated:2024-10-29 09:24:03.0  )
Zeeshan Siddique: సల్మాన్ ఖాన్, జిషాన్ సిద్ధిఖీకి బెదిరింపుల కేసు.. వ్యక్తి అరెస్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్‌ (Salman Khan), బాబా సిద్ధిఖీ (Baba Siddique) కుమారుడు, ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) నేత జిషాన్ సిద్ధిఖీకి (Zeeshan Siddique)కి బెదిరింపుల కేసులో కీలక పరిణామం జరిగింది. వాళ్లిద్దర్నీ చంపేస్తామని బెదిరించిన కేసులో నోయిడాకు చెందిన 20 ఏళ్ల వ్యక్తి మహ్మద్‌ తయ్యబ్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. చంపేస్తామంటూ అక్టోబ‌ర్ 25న గుర్తుతెలియని వ్యక్తులు జిషాన్ ను బెదిరించారు. ఈ బెదిరింపులపై జిషాన్ సిద్ధిఖీ కార్యాల‌య సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు.. బెదిరింపులకు పాల్పడింది నోయిడాకు చెందిన తయ్యబ్ అని గుర్తించారు. కాగా.. ప్రస్తుతం అతడ్ని అరెస్టు చేశారు.

గతంలోనూ బెదిరింపులు..

ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో ఉన్న శత్తుత్వం ముగియాలంటే అంత మొత్తం ఇవ్వాలని ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నెంబర్ కు అక్టోబర్ 17న రాత్రి మెసేజ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ నంబర్‌ ఎవరిది, మెసేజ్‌ ఎక్కడి నుంచి వచ్చిందని కనుక్కొనే పనిలో పడ్డారు. ఈ కేసులో జంషెడ్‌పూర్‌కు 24 ఏళ్ల కూరగాయల వ్యాపారి షేక్‌ హుస్సేన్‌ షేక్‌ మౌసిన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇకపోతే, జిషాన్ సిద్ధిఖీ అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీలో చేరారు. బాంద్రా ఈస్ట్ నుంచి ఎన్సీపీ టికెట్ పై పోటీ చేస్తున్నారు.

Advertisement

Next Story