Narges Mohammadi : నర్గెస్ మొహమ్మదికి నోబెల్ శాంతి బహుమతి

by Rajesh |   ( Updated:2023-10-06 09:27:07.0  )
Narges Mohammadi  : నర్గెస్ మొహమ్మదికి నోబెల్ శాంతి బహుమతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరానియన్ యాక్టివిస్ట్ నర్గెస్ మొహమ్మదికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇరాన్‌లో మహిళల అణచివేత, మానవ హక్కులు, అందరికి స్వేచ్ఛ కోసం ఆమె చేస్తున్న పోరాటానికి గాను నోబెల్ బహుమతి దక్కింది. గతేడాది ఈ అవార్డును బెలరుష్యన్ మానవ హక్కుల అడ్వకేట్ అలెస్ బియాలియాస్కీకి దక్కింది. ఇక, క్వాంటమ్ డాట్స్‌పై విస్తృత పరిశోధనలు చేసిన మౌంగి బవెండి, లూయిస్ బ్రస్, అలెక్సీ ఎకిమోవ్‌లకు రసాయన శ్రాస్తంలో ఇటీవల నోబెల్ బహుమతి దక్కిన విషయం తెలిసిందే. ఫిజిక్స్‌లో పియరీ అగోస్తినీ, ఫెరెంక్ క్రౌజ్, అన్నె ఎల్ హుయిలర్‌లకు ఈ ప్రతిష్టాత్మక బహుమతి దక్కింది.

Advertisement

Next Story

Most Viewed