- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
No Slogans: వందేమాతరం, జైహింద్ నినాదాలు వద్దు.. ఎంపీలకు పార్లమెంట్ మార్గదర్శకాలు
దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ వర్షాకాల బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ కార్యకలాపాలు హుందాగా, సజావుగా సాగేందుకు సభ్యులు పాటించాల్సిన మార్గదర్శకాలపై రాజ్యసభ బులెటిన్ తాజాగా విడుదల అయింది. సభాధ్యక్షుడి రూలింగ్స్‌ను సభ్యులు ప్రత్యక్షంగా కానీ, పార్లమెంట్ లోపల, వెలుపల విమర్శించరాదని తెలిపింది.
అదేవిధంగా సభలో ప్లకార్డులు ప్రదర్శించరాదని, వందేమాతరం, జైహింద్ వంటి నినాదాలు ఇవ్వరాదని సభ్యులకు సూచనలు చేసింది. సభలోకి వచ్చే సమయం, వెళ్లే సమయంలో ప్రతి సభ్యుడు అధ్యక్ష స్థానానికి తల వంచి అభివాదం చేయాలంటూ సభ్యుల కోసం రూపొందించిన హ్యాండ్ బుక్‌లోని నిబంధనలను మరోసారి గుర్తుచేసింది.
కాగా, పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి కేంద్రం మంగళవారం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆరు బిల్లులను సభ ఆమోదం కోసం తీసుకురానుంది.