ఇండియా కూటమి నేతలను కలిసిన నితిష్‌ కుమార్.. వైరల్ అవుతున్న ఫోటోలు

by Harish |
ఇండియా కూటమి నేతలను కలిసిన నితిష్‌ కుమార్.. వైరల్ అవుతున్న ఫోటోలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎన్డీయే కూటమికి గాని లేదా ఇండియా కూటమికి గాని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యు) మద్దతు చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో సభ్యుడిగా ఉన్న నితీష్ కుమార్ ఇండియా కూటమికి మద్దతు ఇచ్చినట్టు, కూటమి ముఖ్యనేతలను ఢిల్లీలో కలిసినట్లుగా ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇవి వైరల్ కావడం గమనార్హం.

ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలు జేడీయూ, టీడీపీ మద్దతు ఉంటేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. దీంతో జేడీయూ, టీడీపీ మద్దతు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. ఒక ఫేస్‌బుక్ వినియోగదారుడు, నితిష్ కుమార్, బాబు ఢిల్లీకి చేరుకుని, ఇండియా కూటమికి చెందిన నాయకులను కలిశారని పాత ఫొటోను షేర్ చేస్తూ క్రింద రాశారు.

అలాగే, మరో వినియోగదారుడు ఇండియా కూటమి నేతలతో భేటీ అయ్యేందుకు నితీష్ కుమార్ ఢిల్లీ వెళ్లారని పోస్ట్‌లో రాశారు. అయితే ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు అన్ని కూడా 2023 నాటివి. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ని ఏర్పాటు చేయడానికి నితీష్ కుమార్, రాహుల్, మల్లికార్జున్ ఖర్గే మొదలగు వారు సమావేశం కాగా, అప్పుడు తీసిన ఫోటో ఇది.

Advertisement

Next Story

Most Viewed