- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న నీతా, ముఖేష్ అంబానీ

దిశ, నేషనల్ బ్యూరో:
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబాని, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబాని హాజరుకానున్నారు. ట్రంప్ నుంచి ఆహ్వానం అందుకున్న అతి కొద్ది మంది బిలియనీర్లలో ఇండియాకు చెందిన అంబాని ఫ్యామిలీ కూడా ఉంది. వీరు ఇప్పటికే తమ ప్రయాణ ఏర్పాట్లను చేసుకున్నారని, సోమవారం జరుగనున్న ఇనాగురేషన్ సెర్మనీకి హాజరవుతారని రిలయన్స్ వర్గాలు తెలిపాయి. దేశంలో అత్యంత శక్తివంతమైన జంటగా పేరున్న అంబానీలు ప్రమాణ స్వీకార వేడుకలో ట్రంప్ కేబినెట్ నామినీలు, ఎన్నికైన సభ్యులతో కలసి కూర్చుంటారని సమాచారం. జనవరి 18న అంబానీ ఫ్యామిలీ వాషింగ్టన్ డీసీ చేరుకుంటుంది. ప్రమాణ స్వీకార వేడుకలకు ముందు శనివారం వర్జీనియాలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు వీరు హాజరవుతారు. కేబినెట్ రిసెప్షన్, వైస్ ప్రెసిడెంట్ డిన్నర్‌లో కూడా అంబానీ ఫ్యామిలీ పాల్గొననుంది. ప్రమాణ స్వీకారానికి ముందు రోజు నీతా, ముఖేష్ అంబానీలు ప్రెసిడెంట్ ట్రంప్ ఇవ్వనున్న క్యాండిల్ నైట్ డిన్నర్‌కు హాజరుకానున్నారు. కాగా, ప్రమాణ స్వీకారానికి అంబానీతో పాటు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్, ఫ్రెంచ్ బిలియనీర్ జేవియర్ నీల్ వంటి వారు పాల్గొంటారు.