Kolkata Doctor Rape-Murder: అర్ధరాత్రి మహిళల నిరసన

by Shamantha N |
Kolkata Doctor Rape-Murder: అర్ధరాత్రి మహిళల నిరసన
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతా పీజీ వైద్యవిద్యార్థిని హత్యకు నిరసనగా మహిళలు ఆందోళన చేపట్టనున్నారు. పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా మహిళలు అర్ధరాత్రి వీధుల్లోకి రానున్నారు. బుధవారం రాత్రి 11.55 గంటలకు నిరసన ప్రారంభించనున్నారు. ‘స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి మహిళల స్వాతంత్య్రం కోసం’ అని పిలుపునిచ్చారు. ఈ నిరసన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నిరసనకు పురుషులు కూడా సంఘీభావం తెలిపారు. పెద్దసంఖ్యలో పాల్గొనేలా నిర్ణయం తీసుకున్నారు. నటులు స్వస్తిక ముఖర్జీ, చుర్ని గంగూలీ, డైరెక్టర్ ప్రతిమ్ డి గుప్తా సహా ప్రముఖులు కూడా ఈ నిరసనకు మద్దతు తెలిపారు.

అసలేం జరిగిందంటే?

కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉండగా 31 ఏళ్ల పీజీ వైద్యవిద్యార్థిని అత్యాచారం, హత్య జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఆస్పత్రికి తరచుగా వచ్చే సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ ని అరెస్టు చేశారు. ఈకేసు దర్యాప్తు పూర్తిచేసేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం వరకు పోలీసులకు గడువు ఇచ్చారు. పోలీసులు ఈ కేసుని ఆలోగా ఛేదించకపోతే సీబీఐకి బదిలీ చేస్తామన్నారు. కోల్‌కతా పోలీస్ కమీషనర్ వినీత్ గోయల్ మాట్లాడుతూ.. సంఘటన సమయంలో సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నామని చెప్పారు. మరో నాలుగైదు రోజుల్లో ఇతర నిందితులు ఎవరైనా ఉన్నట్లయితే వారిని అరెస్టు చేయడం ఖాయమని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed