మధురై హిజ్బ్-ఉతర్-తహ్రీర్ కేసులో తమిళనాడులోని 12 చోట్ల ఎన్ఐఏ సోదాలు

by S Gopi |
మధురై హిజ్బ్-ఉతర్-తహ్రీర్ కేసులో తమిళనాడులోని 12 చోట్ల ఎన్ఐఏ సోదాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మధురైలో హిజ్బ్-ఉతర్-తహ్రీర్ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆదివారం తమిళనాడులోని 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రాష్ట్రంలోని చెన్నై, తిరుచ్చి, ఈరోడ్ ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. చెన్నైలోని ముడిచూరులో కబీర్ అహ్మద్ అనే వ్యక్తి నివాసంలో తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన సోదాలు రెండు గంటలకు పైగా కొనసాగినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఏవైనా పత్రాలు స్వాధీనం చేసుకున్నారా లేదా అనే దానిపై ఎన్ఐఏ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఈరోడ్‌లోని రెండు చోట్ల, తిరుచ్చి, కుంభకోణం, ఇతర ప్రాంతాల్లో కూడా సోదాలు జరిగాయి. నిషేధిత సంస్థ హిజ్బ్-ఉత్-తహ్రీర్‌తో సంబంధం ఉన్నట్టు అనుమానం ఉన్న అన్ని చోట్లను అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. గత నెలలో నిషేధిత సంస్థతో సంబంధాలున్నాయనే కారణాలతో చెన్నైలో ఆరుగురిని అరెస్ట్ చేయగా, వారిపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. గతంలో 2021లో తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో సోదాల తర్వాత మధురై హిజ్బ్-ఉతర్-తహ్రీర్ కేసుతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed