- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎట్టకేలకు ఎంపీగా ప్రమాణం చేయనున్న ఇంజినీర్ రషీద్
దిశ, నేషనల్ బ్యూరో: కశ్మీరీ నేత షేక్ అబ్దుల్లా రషీద్ ఎంపీగా ప్రమాణం చేసేందుకు ఎట్టకేలకు అనుమతి లభించింది. జైలులో ఉన్న రషీద్.. ఎంపీగా ప్రమాణం చేసేందుకు ఎన్ఐఏ అనుమతి దొరికింది. జూలై 25న ఆయన పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు మధ్యంతర బెయిల్ లేదా పెరోల్ ఇవ్వాలని రషీద్ ఇంజినీర్ తరపు లాయర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జూన్ 22న ఈకేసుపై విచారణ వాయిదా వేస్తూ.. స్పందన తెలియజేయాల్సిందిగా ఎన్ఐఏను కోరింది. ఎన్ఐఏ సానుకూలంగా స్పందించడంతో రషీద్ ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. అయితే, ఈ పిటిషన్ పై ఉత్తర్వులు మాత్రం మంగళవారం వెలువడనున్నాయి. అయితే, మీడియాతో మాట్లాడవద్దని షరతు విధించినట్లు ఎన్ఐఏ తరఫు న్యాయవాది తెలిపారు.
అబ్దుల్లా రషీద్ ఎవరంటే?
జమ్మూకశ్మీర్‌కు చెందిన షేక్ అబ్దుల్లా రషీద్ అలియాస్ ఇంజినీర్ రషీద్.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై 2 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతకుముందు రషీద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. ఉగ్రవాదులకు నిధుల సమకూర్చారనే ఆరోపణలతో 2016లో రషీద్ అరెస్టు అయ్యారు. దీంతో, ఆయన కుమారుడు అబ్రార్ రషీద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.