- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NIA : వీహెచ్‌పీ నేత హత్య కేసు సూత్రధారి ‘బబ్బర్ ఖల్సా’.. ఎన్ఐఏ ఛార్జిషీట్
దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్ కేంద్రంగా ఖలిస్తానీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. భారత్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు పన్నుతున్నారు. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) పేరుతో ఓ ఉగ్రవాద సంస్థ పాక్‌లో నడుస్తోంది. దాన్ని వాధ్వా సింగ్ అలియాస్ బబ్బర్ నడుపుతున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 13న పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ నాయకుడు వికాస్ ప్రభాకర్ అలియాస్ వికాస్ బగ్గా దారుణ హత్య జరిగింది. దీని వెనుక బీకేఐ హస్తం ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది.
విచారణ జరిపి వివరాలను సేకరించిన ఎన్ఐఏ.. తాజాగా ఆ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఇందులో బీకేఐ చీఫ్ వాధ్వా సింగ్, మరో ఐదుగురు ఉగ్రవాదుల పేర్లను నిందితుల జాబితాలో చేర్చింది. పాక్‌లో ఉంటున్న వాధ్వాసింగ్, మరో ఇద్దరు ఉగ్రవాదులే వీహెచ్‌పీ నేత హత్యకు సూత్రధారులని విచారణలో వెల్లడైంది. ఇంకో ముగ్గురిని అరెస్టు చేశామని ఎన్ఐఏ వెల్లడించింది. ఈ కేసును ఈ ఏడాది మే 9న పంజాబ్ పోలీసులు ఎన్ఐఏకు అప్పగించారు.