రామేశ్వరం కేఫ్‌‌లో ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన NIA

by Harish |   ( Updated:2024-04-12 05:46:45.0  )
రామేశ్వరం కేఫ్‌‌లో ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన NIA
X

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌‌లో పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పేలుడులో కీలక నిందితుల కోసం గత కొన్ని రోజులుగా వెతుకుతున్నారు. తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ఈ కేసులో పురోగతి సాధించింది. రామేశ్వరం కేఫ్‌‌లో బాంబ్ అమర్చి పరారీలో ఉన్న ఉగ్రవాది షాజిబ్ హుస్సేన్‌‌తో పాటు మరో నిందితుడు దాడికి ప్రధాన సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. పేలుడు తరువాత వారు అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో తలదాచుకున్నట్లు తెలుస్తుంది. వారిని కోల్‌కతా నుండి అదుపులోకి తీసుకున్నారు. షాజిబ్ హుస్సేన్ కేఫ్ ప్రాంగణంలో బాంబును అమర్చడంలో కీలకంగా వ్యవహరించాడు.

మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌‌లో బాంబ్ పేలడంతో దాదాపు 10 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. పేలుడు తర్వాత సీసీటీవీ పరిశీలించగా, మాస్క్ ధరించిన వ్యక్తి బాంబు ఉన్న బ్యాగును కేఫ్‌లో వదిలివెళ్లినట్టుగా వీడియోలో రికార్డయింది. అప్పటి నుంచి నిందితుల కోసం వెతుకుతున్నారు. పేలుడు తర్వాత ఒక నిందితుడు బట్టలు మార్చుకుని క్యాప్ ధరించి బస్సులో ప్రయాణించిన ఫొటో కూడా ఇటీవల బయటకు వచ్చింది. ఆ ఆధారాల ప్రకారం నిందితులను పట్టుకోవడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), బెంగళూరు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తీవ్రంగా కృషి చేయగా నిందితులను పట్టించిన వారికి రికార్డు కూడా ప్రకటించాయి. తాజాగా ప్రధాన నిందితులను ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది.

Advertisement

Next Story