- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NHAI: టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీ... గుడ్ న్యూస్ చెప్పిన ఎన్ హెచ్ఏఐ
దిశ, డైనమిక్ బ్యూరో: టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీ నివారణ చర్యల్లో భాగంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ఏఐ) గుడ్ న్యూస్ చెప్పింది. ఇందు కోసం సరికొత్త విధానాన్ని అనుసరించబోతున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా రద్దీగా ఉండే 100 టోల్ ప్లాజాలను జీఐఏ-ఆధారిత సాప్ట్ వేర్ తో ఎన్ హెచ్ఏఐ పర్యవేక్షించబోతున్నట్లు తెలిపింది. ఈ వంద టోల్ ప్లాజాలలో ట్రాఫిక్ తో పాటు ఇతర అంశాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఆ సమాచారాన్ని వాహనదారులకు చేరవేస్తూ అలర్ట్ లు జారీ చేయనుంది. టోల్ ప్లాజా పేరు, అక్కడ ఎంత మేర ట్రాఫిక్ ఉంది, అక్కడ ఎంత సమయం వేడి ఉండాలి, అక్కడ వాహనాల మూవ్ మెంట్ వంటి వివరాలు జీఐఎస్ సాఫ్ట్ వేర్ అందిచనున్నది. లేన్ డిస్ట్రిబ్యూషన్ వంటి సిఫార్సులు సైతం ఈ సాఫ్ట్ వేర్ అందించనుంది. నేషనల్ హైవే హెల్ప్ లైన్ నంబర్ 1033 కి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా రద్దీగా ఉండే 100 టోల్ ప్లాజాలను జీఐఎస్ కోసం తొలుత ఎంపిక చేశారు. దశలవారీగా మరిన్ని టోల్ ప్లాజాలకు ఈ సేవలను విస్తరించనున్నారు. టోల్ ప్లాజాలు దేశవ్యాప్తంగా ఉన్న సంబంధిత ఎన్ హెచ్ఏఐ ఫీల్డ్ ఆఫీసులతో ఈ వెబ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ ను అనుసంధానం చేయడం వల్ల ఆయా టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ క్యూ, రద్దీ వివరాలు వెంట వెంటనే విశ్లేషించేందుకు దోహదపడుతుంది. దీంతో పాటు ఈ సాఫ్ట్‌వేర్ ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు సంబంధించిన అప్‌డేట్‌లను, స్థానిక పండుగల గురించి సమాచారాన్ని అందిస్తుంది. దీని ద్వారా ఎన్ హెచ్ఏఏ అధికారులు టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడానికి ముందస్తు చర్యలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది.