- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Amit Shah: కొత్త శకం ప్రారంభమైంది- భారత్ పోల్ పోర్టల్ ప్రారంభించిన అమిత్ షా
దిశ, నేషనల్ బ్యూరో: అన్ని రకాల కేసుల విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా భారత్ పోల్ (Bharatpol) వ్యవస్థను ప్రారంభించింది. భారత్ పోల్ పేరిట తీసుకొచ్చిన పోర్టల్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amit Shah) ఆవిష్కరించారు. అంతర్జాతీయ కేసుల విషయంలో కొత్త శకం ప్రారంభమైందని అమిత్ షా అన్నారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన దర్యాప్తు సంస్థలు ఇంటర్‌పోల్‌తో(Interpol) సులువుగా కనెక్ట్ అయ్యేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సవాళ్లు, మన వ్యవస్థల్లో మార్పులు చేసుకోవాల్సిన, ఆధునిక సాంకేతికతలను ఉపయోగించాల్సిన సమయం ఇది. ఆ దిశగా భారత్‌పోల్ అనేది ఒక అడుగు’’ అని అమిత్ షా వెల్లడించారు. ఈ కొత్త వ్యవస్థతో పాటు, మూడు క్రిమినల్ చట్టాల గురించి రాష్ట్రాలకు శిక్షణ ఇచ్చే బాధ్యతను సీబీఐ తీసుకోవాలని ఈసందర్భంగా కోరారు.
100 మంది స్వదేశానికి.
ఇకపోతే, సాంకేతిక సంస్థలను వాడుకుని పరారీలో ఉన్న నేరగాళ్లను అదుపులోకి తీసుకునేందుకు ఈ పోర్టర్ సహకరించనుంది. భారత ఏజెన్సీలు వేగవంతంగా అంతర్జాతీయ పోలీసుల సహకారం తీసుకునేందుకు సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) సహకారంతో కేంద్రం దీనిని అభివృద్ధి చేశారు. అంతేకాకుండా, 2021 నుండి 2024 వరకు వందమంది వాంటెడ్ క్రిమినల్స్ ను ఇంటర్ పోల్ ఛానెల్స్ ద్వారా భారత్ కు తిరిగి తీసుకువచ్చారు.