- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదలకు మోడీ గుడ్ న్యూస్.. తొలి కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంలో కొలువుదీరిన నరేంద్ర మోడీ 3.0 సర్కార్ ప్రజలకు బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ చెప్పింది. సోమవారం ఉదయం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోడీ.. ఆ వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న 9.30 కోట్ల మంది రైతులకు రూ. 20 వేల కోట్ల ఆర్థిక సాయం అందించే పీఎం కిసాన్ నిధి విడుదలకు సంబంధించిన ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి కేబినెట్ భేటీలో మరో కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించేందుకు ఆర్థిక సహకారం ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఢిల్లీ లోక్ కల్యాణ్ మార్గ్ లోని మోడీ నివాసంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. ఈ మంత్రివర్గ భేటీ అనంతరం నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించే అవకాశం ఉంది. అయితే ఎవరికి ఏ శాఖ దక్కబోతున్నదో అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.