- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Neet aspirant: నీట్ విద్యార్థినిపై ఆరు నెలలుగా టీచర్ల లైంగిక దాడి.. యూపీలో దారుణ ఘటన
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్(Uthara Pradesh)లో దారుణ ఘటన వెలుగు చూసింది. నీట్ పరీక్ష(Neet Exam)కు ప్రిపేరవుతున్న ఓ మైనర్ బాలికపై ఆమెకు క్లాసులు బోధించే ఉపాధ్యాయులే బంధీగా ఉంచుకుని ఆరు నెలలుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. బ్లాక్ మెయిల్ చేస్తూ నిరంతరం అఘాయిత్యానికి ఒడిగట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని ఫతేపూర్‌కు చెందిన ఓ మైనర్ విద్యార్థిని నీట్ కోచింగ్ నిమిత్తం కాన్పూర్‌కు వచ్చింది. ఓ ఇన్సిట్యూట్‌లో జాయిన్ అయ్యి పరీక్షకు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలోనే విద్యార్థినికి ఉపాధ్యాయులు సాహిల్ సిద్ధిఖీ, వికాస్ పోర్వాల్‌తో పరిచయం ఏర్పడింది. అయితే ఈ ఏడాది జనవరిలో తన ఇంట్లో జరిగే పార్టీకి రావాలని సిద్ధిఖీ బాలికను ఆహ్వానించారు. విద్యార్థులందరూ వస్తున్నారని నమ్మ బలికారు. దీంతో సిద్ధిఖీ ఇంటికి వెళ్లిన బాలికపై మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
అంతేగాక ఘటనను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతానని బెదిరించాడు. అనంతరం ఆరు నెలల పాటు బంధీగా ఉంచుకుని మరో టీచర్ పోర్వాల్‌తో కలిసి పదే పదే లైంగిక దాడి చేశారు. కొద్ది రోజుల తర్వాత ఇంటికి వెళ్లిన బాలిక పోలీసులను ఆశ్రయించడానికి బయపడింది. అయితే బాలిక తిరిగి కాన్పూర్ కు రావాలని టీచర్లిద్దరూ ఫోన్ చేసి బెదిరించారు. అంతేగాక సిద్ధిఖీ మరో విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్టు వీడియో వైరల్ కావడంతో బాలిక ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సీనియర్ పోలీస్ అధికారి అభిషేక్ పాండే తెలిపారు. టీచర్లిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు వెల్లడించారు.