పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఎన్డీఏ సమావేశం

by S Gopi |
పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఎన్డీఏ సమావేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కొత్తగా ఎన్నికైన ఎంపీల సమావేశాన్ని శుక్రవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో నిర్వహించనుంది. ఈ సమావేశానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన ఎంపీలు హాజరు కానున్నారు. కూటమి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ 240 సీట్లకు పరిమితం అయిన నేపథ్యంలో భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జేడీయూ పార్టీల సహకారం అనివార్యంగా మారింది. అంతకుముందు బుధవారం ఎన్డీయేలోని పార్టీల నేతలు సమావేశమై ప్రధాని నరేంద్ర మోడీని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన భారత్‌ నిర్మాణానికి ఎన్డీఏ కృషి చేస్తుందన్నారు. జరగబోయే ఎన్డీఏ ఎంపీల సమావేశంలో కొత్త ఎంపీలు తమ నేతగా మోడీని ఎన్నుకుంటూ తీర్మాణం చేయడమే కాకుండా తీర్మాన ప్రతిని సంకీర్ణ నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేయనున్నారు. కాగా, జూన్ 9న నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed