3, 6 త‌ర‌గ‌తుల‌కు ఎన్‌సీఈఆర్టీ కొత్త పాఠ్య పుస్త‌కాలు

by Hajipasha |
3, 6 త‌ర‌గ‌తుల‌కు ఎన్‌సీఈఆర్టీ కొత్త పాఠ్య పుస్త‌కాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : కొత్త పాఠ్య పుస్త‌కాల‌పై ఎన్‌సీఈఆర్టీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈసారి కొత్త సిల‌బ‌స్‌తో 3, 6 త‌ర‌గ‌తుల‌కు మాత్ర‌మే పాఠ్య పుస్త‌కాల‌ను విడుద‌ల చేస్తామని వెల్ల‌డించింది. 3వ త‌ర‌గ‌తికి సంబంధించిన కొత్త పుస్త‌కాల‌ను ఏప్రిల్ చివ‌రి వారంలో, 6వ త‌ర‌గ‌తికి సంబంధించిన పుస్త‌కాల‌ను మే మూడో వారంలో విడుద‌ల చేస్తామని తెలిపింది. 4, 5, 9, 11వ త‌ర‌గ‌తుల‌కు సంబంధించిన పాఠ్య పుస్తకాల బ‌ఫ‌ర్ స్టాక్ సిద్ధంగా ఉందని పేర్కొంది. 1, 2, 7, 8, 10, 12 త‌ర‌గ‌తుల‌కు సంబంధించి 2023-24 ఎడిష‌న్స్ పాఠ్య పుస్త‌కాలు 1.21 కోట్ల కాపీలు దేశ వ్యాప్తంగా విడుద‌ల చేశామని ఎన్‌సీఈఆర్టీ చెప్పింది. మారిన క‌రికుల‌మ్‌కు అనుగుణంగా 6వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌ను ప్రిపేర్ చేసేందుకు వీలుగా టీచ‌ర్ల కోసం ఎన్‌సీఈఆర్టీ పోర్ట‌ల్‌లో బ్రిడ్జ్ కోర్సు అందుబాటులో ఉంద‌ని వెల్లడించింది. అన్ని పాఠ్య పుస్త‌కాల డిజిట‌ల్ కాపీలు ఎన్‌సీఈఆర్టీ వెబ్‌సైట్‌తో పాటు DIKSHA, ePathshala పోర్ట‌ల్, యాప్‌ల‌లో ఉచితంగా ల‌భిస్తాయ‌ని తెలిపింది. ఈవివరాలను ట్విట్టర్ (ఎక్స్) వేదికగా అనౌన్స్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed