జమ్మూకశ్మీర్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి విజయ కేతనం

by M.Rajitha |
జమ్మూకశ్మీర్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి విజయ కేతనం
X

దిశ, వెబ్ డెస్క్ : ఆర్టికల్ 370 (Artical 370) రద్దు తర్వాత జమ్మూకశ్మీర్(Jammu & Kashmir)లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్(NC - Congress) కూటమి విజయం సాధించింది. మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ 48 స్థానాలను దక్కించుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Omar Abdulla) నేతృత్వంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 41 స్థానాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ 6 స్థానాలు కైవసం చేసుకుంది. ఎన్సీ మరో చోట ఆధిక్యంలో ఉంది. ఇక అదే కూటమిలోని సీపీఎం ఒక స్థానాన్ని గెలుచుకుంది. కూటమికి ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీ 27 స్థానాల్లో విజయాన్ని సొంతం చేసుకోగా.. మరో రెండు చోట్ల ముందంజలో ఉంది.

ఈ విజయంతో ఆనందాన్ని వ్యక్తం చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా.. తన కుమారుడు ఒమర్ అబ్దుల్లా సీఎం పదవి చేపడతారని ప్రకటించారు. 2019 ఆగస్ట్ 5వ తేదీ జమ్మూకశ్మీర్ కు పీడకల వంటి రోజని.. ఆర్టికల్ 370తో రద్దుతో మా హక్కులన్నీ బీజేపీ ప్రభుత్వం లాక్కుందని దుయ్యబట్టారు. ఇప్పటికీ ఆ నిర్ణయాన్ని మేము అంగీకరించడం లేదని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ నిరణతరం పోరాడుతూ ఉంటుందని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed