Trivikram Srinivas : "సమంత వ్యక్తి కాదు.. ఓ శక్తి"

by M.Rajitha |   ( Updated:2024-10-09 06:43:19.0  )
Trivikram Srinivas : సమంత వ్యక్తి కాదు.. ఓ శక్తి
X

దిశ, వెబ్ డెస్క్ : నటి సమంత(Samantha)పై టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంత అభిమానులను పొందిన స్టార్ సమంత మాత్రమే అని ప్రశంసల జల్లు కురిపించారు. చాలా సినిమాలకు ఆమెనే హీరో అని.. 'ఆమెకు వేరే శక్తి అవసరం లేదు.. సమంతానే ఓ శక్తి' అని పొగిడారు. సమంత అప్పుడప్పుడైనా హైదరాబాద్ కు రావాలని కోరుతున్నానని తెలిపిన త్రివిక్రమ్.. మీరు ఇక్కడే ఉంటే మీ గురించే ప్రత్యేక కథలు రాసి సినిమాలు తీయడానికి దర్శకులు రెడీగా ఉన్నారని పేర్కొన్నారు. 'అత్తరింటికి దారేది'లాగా.. సమంతా హైదరాబాద్ కు వచ్చే దారేది అనలేమో అంటూ.. సమంత హైదరాబాద్ రావాలని కోరుతూ ఆమె అభిమానులు ట్రోల్ చేయాలని త్రివిక్రమ్ కోరారు.

సమంత సహ నిర్మాతగా వ్యవహరించిన 'జిగ్రా' సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు రానా దగ్గుబాటి, త్రివిక్రమ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, వేదాంగ్ రైనా, రాహుల్ రవీంద్రలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను వాసన్ బాలా తెరకెక్కించారు. ఈ నెల 11న థియేటర్లలో సందడి చేయనున్న ఈ మూవీ ప్రి రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ పై వ్యాఖ్యలు చేశారు.

Also Read: సమంత రియల్ హీరో.. ‘జిగ్రా’ ఈవెంట్‌లో ఆలియా కామెంట్స్

Advertisement

Next Story