వైసీపీ వర్గాల రాళ్ళ దాడి.. టీడీపీ కార్యకర్త మృతి

by M.Rajitha |
వైసీపీ వర్గాల రాళ్ళ దాడి.. టీడీపీ కార్యకర్త మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రామ దేవత ఉత్సవాల్లో జరిగిన చిన్న గొడవ ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం వనవిష్ణుపురం గ్రామంలో గ్రామ దేవత ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఓ చిన్న వివాదం చిలికి చిలికి పెద్ద గొడవకు దారి తీసి.. వైసీపీ వర్గానికి చెందిన కొంతమంది టీడీపీ వర్గీయులపై రాళ్ళ దాడికి దిగారు. ఈ ఘర్షణలో ఓ టీడీపీ కార్యకర్త తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఉన్నతాధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చి, భారీ బందోబస్తు నడుమ మిగతా ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement

Next Story