- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టాక్స్‌లో పెట్టుబడి పేరుతో రూ. 1.36 కోట్లు మోసగించిన సైబర్ మోసగాళ్లు
దిశ, నేషనల్ బ్యూరో: షేర్ల ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడతామని సైబర్ మోసగాళ్లు ఓ వ్యక్తిని రూ. కోటికి పైగా మోసం చేసిన ఘటన తాజాగా థానేలో వెలుగులోకి వచ్చింది. నవీ ముంబైకి చెందిన ఓ వ్యక్తిని సైబర్ మోసగాళ్లు రూ. 1.36 కోట్లను కొట్టేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, నవీ ముంబైకి చెందిన 48 ఏళ్ల ఓ వ్యక్తిని ఏంజెల్ వన్ అనే కంపెనీతో పాటు జూయి నగర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు వాట్సప్ ద్వారా సంప్రదించి షేర్ల ట్రేడింగ్ గురించి నమ్మించారు. కంపెనీలో పెట్టుబడులు పెడితే రాబడి భారీగా ఉంటుందని, అందుకోసం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి రూ. 1.36 కోట్లను తీసుకున్నారు. బాధితుడు వివిధ బ్యాంకు ఖాతాలకు ఆ సొమ్మును బదిలీ చేశాడని తెలిపారు. అయితే, రోజులు గడుస్తున్నప్పటికీ తను ఇచ్చిన డబ్బు రాకపోవడంతో బాధితుడు మోసపోయినట్టు గ్రహించాడు. జరిగిన విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించామని, ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదని వెల్లడించారు.