రూ. 800 కోట్లతో హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభించిన ఒడిశా సీఎం

by S Gopi |
రూ. 800 కోట్లతో హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభించిన ఒడిశా సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని పూరి క్షేత్రంలోని జగన్నాథ ఆలయం చుట్టూ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును రూ. 800 కోట్లతో ప్రతిష్టాత్మకంగా పూర్తి చేశారు. ఇది పూరీలోని చారిత్రాత్మక శ్రీ జగన్నాథ ఆలయం చుట్టూ యాత్రికుల కోసం మెరుగైన సౌకర్యాలను అందించే లక్ష్యంతో నిర్మించారు. గణపతి మహారాజు పూరి దిబ్యాసింగ్ దేవ్, 90 పుణ్యక్షేత్రాల ప్రతినిధులు, భక్తుల సమక్షంలో ఈ ప్రాజెక్టును ఆవిష్కరించారు. జగన్నాధుడి ఆశీస్సులతోనే ఇది పూర్తయిందని నవీన్ పట్నాయక్ అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆలయానికి వచ్చే భక్తుల కోసం పార్కింగ్, రోడ్డు నిర్మాణం, సామగ్రి భద్రతకు క్లాక్ రూములు, ఆలయం లోపల, చుట్టుపక్కల వసతులు కల్పించారు. ఈ సందర్భంగా పూరీ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. సంక్రాంతి రోజున ఈ కార్యక్రమం జరగ్గా, బుధవారం గణపతి మహారాజు దిబ్యాసింగ్ దేవ్ పూర్ణాహుతితో పూర్తయింది. అనంతరం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రాజెక్టును ప్రారంభించి భక్తులకు అంకితమిచ్చారు.

Advertisement

Next Story