- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
100 రోజుల రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని మంత్రులను కోరిన ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల తర్వాత ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం కోసం మొదటి 100 రోజులతో పాటు వచ్చే ఐదేళ్ల కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలని ప్రధాని మోడీ ఆదివారం మంత్రులను కోరినట్టు తెలుస్తోంది. ఆదివారం ఉదయం జరిగిన కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన మోడీ, మంత్రులను ఉద్దేశిస్తూ, రాబోయే ఐదేళ్ల కోసం ఎజెండాను ఎలా అమలు చేయవచ్చో చర్చించేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఇతర అధికారులను కలవాలని సూచించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల సంఘం శనివారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగియనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలోనే కేబినెట్ సమావేశంలో మంత్రులకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారు. జూన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తక్షణం తీసుకోవాల్సిన చర్యలు, 100 రోజుల ఎజెండా గురించి చర్చించారు.