- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మా అమ్మ దేశం కోసం తన మంగళసూత్రాన్ని త్యాగం చేసింది': ప్రియాంక గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో: 'కాంగ్రెస్ ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం చొరబాటుదారులకు పంచుతుందని, మహిళల మంగళసూత్రాన్ని కూడా వాళ్లు వదలరని ' ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాందీ గట్టి కౌంటర్ ఇచ్చారు. మంగళసూత్రం విషయానికొస్తే, తన తల్లి దేశం కోసం త్యాగం చేసిందని, తన అమ్మమ్మ బంగారాన్ని యుద్ధ సమయంలో విరాళంగా ఇచ్చారని గుర్తుచేశారు. బెంగళూరు కార్యక్రమంలో మాట్లాడిన ప్రియాంక గాంధీ ప్రజలనుద్దేశించి.. ప్రధాని మోడీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళికలు లేవు కానీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ప్రధాని 400 సీట్లు సాధిస్తామని, రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారు. కొన్నిసార్లు తనను విమర్శిస్తున్నారని అంటారు, మరోసారి మతం గురించి మాట్లాడుతారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. 'మంగళసూత్రం' ప్రాముఖ్యత గురించి ప్రధాని మోడీ అర్థం చేసుకుని ఉంటే ఇలా మాట్లాడే వారు కాదన్నారు. నోట్ల రద్దు జరిగినప్పుడు మహిళల పొదుపు సొమ్మును మోడీ దోచుకున్నారు. నిరసనల కారణంగా 600 మంది రైతులు ప్రాణాలను కోల్పోయారు. కానీ ఏనాడు మోడీ ఆ వితంతువుల మంగళసూత్రం గురించి ఆలోచించారా? అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.