Kamal Hassan : కమల్‌హాసన్‌ కు ముస్లింల నిరసన సెగ

by M.Rajitha |
Kamal Hassan : కమల్‌హాసన్‌ కు ముస్లింల నిరసన సెగ
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళ ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ (Kamal Hassan) కు ముస్లిం సంఘాల నుండి తీవ్ర నిరసన ఎదురైంది. ఇటీవల కమల్ నిర్మించిన అమరన్‌(Amaran) చిత్రంలో ముస్లింలను ఉగ్రవాదులుగా చూపెట్టారు అని ఆరోపణలు చేశారు. సినిమాలో అలాంటి అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని ఎస్డీపీఐ(SDPI) డిమాండ్ చేసింది. చెన్నైలోని కమల్ నివాసం వద్ద పలు ముస్లిం సంఘాలు ధర్నా చేపట్టాయి. కమల్‌హాసన్‌ దిష్టిబొమ్మ దహనం చేయడంతోపాటు.. తక్షణమే ఆయా సన్నివేశాలను తీసేయాలి అంటూ నినాదాలు చేశారు. కాగా పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement
Next Story

Most Viewed