లక్ష్మీబాయి విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించడంపై హైకోర్టుకు ముస్లిం సంఘం క్షమాపణ

by karthikeya |   ( Updated:2024-09-28 06:53:59.0  )
లక్ష్మీబాయి విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించడంపై హైకోర్టుకు ముస్లిం సంఘం క్షమాపణ
X

దిశ, వెబ్‌డెస్క్: షాహీ ఈద్గా సమీపంలో ఉన్న పార్క్‌లో రాణి ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని వక్ఫ్ బోర్డు వ్యతిరేకించడాన్ని హైకోర్టు తీవ్రంగా పరగణిండంతో ఈద్గా మేనేజింగ్ కమిటీ క్షమాపణలు చెప్పింది. కాగా.. ఢిల్లీలోని షాహీ ఈద్గా మసీద్ సమీపంలోని పార్క్‌లో రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కొంతమంది సిద్ధం కాగా.. ఆ భూమి వక్ఫ్ బోర్డుదని, అక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహం ఏర్పాటు చేయడానికి వీల్లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ముస్లిం సంఘం పిటిషన్‌ను కొట్టిపారేసింది. ఈ క్రమంలోనూ పిటిషనర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఝాన్సీ లక్ష్మీబాయి స్వాతంత్ర్య సమరయోధురాలని, దేశం మొత్తం ఆరాధించాల్సిన వీర వనిత అని, అలాంటి వ్యక్తిని మతం ఆధారంగా విభజించడం ఏంటంటూ మండిపడింది.

ఈ క్రమంలోనే డివిజన్ బెంచ్‌ తీర్పుపై తీవ్ర విమర్శలు గుప్పించిన షాహీ ఈద్గా సంఘం.. హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు కూడా ఈ వ్యవహారంలో షాహీ ఈద్గా సంఘాన్నే తప్పుబట్టింది. ‘‘ఇలాంటి పిటిషన్లతో మీరేం చేయాలనుకుంటున్నారు..? కేవలం మత రాజకీయాలు చేయాలనే దురుద్దేశంతోనే ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారా..?’’ అని నిలదీసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణను పత్రాలను తీసుకురావాలని.. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ప్రార్థన మందిరానికి సమీపంలో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయనే ముస్లిం సంఘాలు చేసిన వాదనలను తోసిపుచ్చింది. స్వాతంత్ర్య సమరయోధురాలైన ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహం వల్ల మతపరమైన హక్కులకు ఏ విధంగా ప్రమాదం కలుగుతుందో చెప్పాలని కోరింది. దీంతో శుక్రవారం కోర్టుకు ముస్లిం సంఘం క్షమాపణలు చెప్పడంతో పాటు గతంలో న్యాయమూర్తులు, ప్రార్థన మందిరాలపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు తెలియజేసింది.

Advertisement

Next Story

Most Viewed